షర్మిల పాత్రలో భూమిక
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడైన మహి వి.రాఘవ్ తన క్యాస్టింగ్ విషయంలో ఎవరూ ఊహించని విధంగా నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. 2003లో వైఎస్ హిట్ ఫార్మాట్ యాత్రను బేస్ చేసుకొని బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాత్ర అనే ఈ సినిమాలో ఇప్పటికే వైఎస్ పాత్రకు మమ్ముట్టి ఎంపికయ్యారు. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్రలో పోసాని, బాహుబలి యాక్టర్ ఆశ్రిత విజయమ్మ పాత్రలో కన్పించనున్నారు. అయితే వైఎస్ యాత్రలో కీలకపాత్ర పోషించారు ఆయన కుమారుడు జగన్, కూతురు షర్మిల. అయితే షర్మిల పాత్రకోసం భూమికను ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఎంసిఎ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన విలక్షణ నటనతో మళ్లీ అలరించనున్నారు.













