సల్మాన్ తో కత్రినా పెళ్లి ?
బాలీవుడ్లో తాజాగా షికారు చేస్తున్న వార్తలు నిజమైతే కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోనున్నాడు. తన ఫేవరెట్ హీరోయిన్ కత్రినాకైఫ్‌ను కట్టుకునేందుకు సల్మాన్ సమాయత్తమవుతున్నాడని సమాచారం. హలో అనే సినిమాలో తొలిసారి సల్మాన్‌తో జత కట్టిన కత్రినా, ఆ తర్వాత ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాల్లో సల్మాన్ సరసన నటించింది. ప్రస్తుతం భారత్ చిత్రంలోనూ సల్మాన్‌కు జోడీగా కత్రినా నటిస్తోంది. సల్మాన్-కరీనా నటించిన బాడీగార్డ్‌లో ఈ భామ ఐటం సాంగ్ చేసింది. కత్రినా కైఫ్ కోసం అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ చిత్రంలో సల్మాన్ స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చాడు.కెరీర్ బిగినింగ్‌లో కత్రినాను ఒక రేంజ్లో ప్రోత్సహించింది కూడా సల్మాన్ ఖాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో థర్టీ ప్లస్ అయిన కత్రినా ఫిప్టీ ప్లస్ అయినా సల్మాన్‌కు సహధర్మచారిణిగా మారనుందనే వార్త ప్రస్తుతం బాలీవుడ్లో హల్చల్ చేస్తున్నది.













