సీత పాత్ర కోసం పోటీ పడుతున్న స్టార్ హీరోయిన్లు
బాహుబలి తర్వాత బాలీవుడ్ హీరోలకు పోటీగా నిలబడిన ప్రభాస్ తో బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ చిత్రానికి నేషనల్ వైజ్ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు ఆదిపురుష్ టైటిల్ ఫిక్స్ చేసి టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ విలు విద్య నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధే శ్యాం షూటింగ్ పూర్తి కాగానే ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొనున్నడని సమాచారం. ప్రభాస్ #21 వైజయంతి మూవీస్ చిత్రం అనుకున్నారు కానీ ఆదిపురుష్ ప్రభాస్ 21వ చిత్రంగా షూటింగ్ స్టార్ట్ చేస్త్తారని తెలిసింది.
ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణుడిగా సైఫ్ ఆలి ఖాన్ నటిస్తాడని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సీత పాత్రలో ముగ్గురు హీరోయిన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమాకు గాను దీపిక పదుకొణెని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా, ఆదిపురుష్ కోసం సీత పాత్రలో కీర్తి సురేష్ గాని కియరా అద్వానిని గని ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది. కీర్తి సురేష్ మహానటితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోగా కియరా అద్వాని వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతో ఫుల్ ఫాంలో ఉంది. దాదాపు ఈ ఇద్దరిలో ఆదిపురుష్ లో సీత పాత్ర ఒకరు చేస్తారని తెలుస్తుంది. ఒకవేళ వీరిద్దరు కాదంటే ప్రియాంకా చోప్రా ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతుందని తెలుస్తుంది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ అదరగొడతాడని తెలుస్తుంది. కేవలం 70 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ వర్కింగ్ డేస్ వుంటాయని, 2022 జనవరి లో విడుదల చేసాయడానికి ప్లాన్ చేస్తున్నట్టు బాలీవుడ్ బోగట్టా.













