Ajith: అజిత్ ఎవరితో ముందుకెళ్తాడో
రీసెంట్ గా విడాముయార్చి(Vidamuyarchi)తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అజిత్(Ajith), ఆ మూవీతో రూ.120 కోట్లకు పైగా కలెక్ట్ చేశాడు. విడాముయార్చి తర్వాత అజిత్, అధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) సినిమా చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఈ సినిమాను నిర్మిస్తోంది. ఏప్రిల్ 10న గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్లలోకి రానుంది.
ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన అన్ని పనుల్ని పూర్తి చేసిన అజిత్ ఇప్పుడు కార్ రేసింగ్ పై దృష్టి పెట్టాడు. గత నెలలో దుబాయ్ లో జరిగిన కార్ రేస్ లో పార్టిసిపేట్ చేసిన ఆయన టీమ్ థర్డ్ ప్లేస్ లో నిలిచింది. అక్టోబర్ వరకు కార్ రేసింగ్ లో బిజీ ఉండనున్న కారణంగా సినిమాలకు గ్యాప్ ఇస్తున్నట్టు అజిత్ ఇప్పటికే ప్రకటించాడు.
అయినా అజిత్ తన తర్వాతి సినిమా ఏకే64(AK64) కోసం కథలు వింటున్నాడు. అయితే అజిత్ ను నెక్ట్స్ డైరెక్ట్ చేయబోయే డైరెక్టర్ ఇతనే అంటూ రోజుకో డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. బిల్లా(Billa)తో అజిత్‌కు మంచి హిట్ అందించిన విష్ణు వర్థన్(Vishnu Vardhan) పేరుతో పాటూ, గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ కు కూడా అజిత్ మరో ఛాన్స్ ఇచ్చాడని, కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) చెప్పిన కథకు అజిత్ ఇంప్రెస్ అయ్యాడని అంటున్నారు. వీరితో పాటూ నిథిలన్ సామినాథన్(Nithilin Saminathan), శిరుత్తై శివ(Siruthai Siva), విఘ్నేష్ రాజా(Vignesh Raja) పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరితో అజిత్ ముందుకెళ్తాడో చూడాలి.













