Prabhas: ప్రభాస్ కు మొదటిసారి కన్నీళ్లు ఎప్పుడొచ్చాయంటే

బాహుబలి(baahubali) మూవీ తర్వాత ప్రభాస్(Prabhas) క్రేజ్ చాలా పెరిగింది. అప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ను బాహుబలి సినిమా పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. ప్రస్తుతం ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. పలు సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్(the Raja saab), ఫౌజీ(Fouji) సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ రెండు సినిమాలూ పూర్తి చేశాక సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్(Spirit) సినిమాను చేయాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నారని ఇప్పటికే సందీప్ వెల్లడించారు. ఇంకా స్పిరిట్ సెట్స్ పైకి కూడా వెళ్లలేదు కానీ ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. స్పిరిట్ తర్వాత సలార్2(Salaar2), కల్కి2(Kalki2) సినిమాలను కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది.
అయితే అసలు విషయానికొస్తే, వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ కు సంబంధించిన ఓ పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ప్రభాస్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన ఫస్ట్ మూవీ ఈశ్వర్(Eshwar) పూజ టైమ్ లో ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు, ఈ ఈశ్వర్ కు మూడు గుండెలు అనే డైలాగును చెప్పానని, ఆ డైలాగ్ ఎలా చెప్పానో కూడా తెలియదని, టెన్షన్ లో ఏదో చెప్పేశానని, కానీ ఆ డైలాగ్ చెప్పాక అతని తండ్రి తన చెయ్యి పట్టుకుని యస్ అనడంతో ఫస్ట్ టైమ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయని ప్రభాస్ ఆ వీడియోలో చెప్పగా, ఆ వీడియో ఇప్పుడు నెట్టంట వైరల్ అవుతుంది.
https://www.instagram.com/reel/DErzdDJp_rd/?utm_source=ig_web_copy_link