Sri Tej: బన్నీ అభిమాని శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే
పుష్ప2(Pushpa2) ప్రీమియర్స్ టైమ్ లో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన వల్ల రేవతి(Revathi) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా, ఆమె కొడుకు తీవ్ర గాయాలో ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. గాయాలతో ఉన్న శ్రీతేజ్(Sritej) ను సికింద్రాబాద్ కిమ్స్ కు తరలించారు. బాబు హెల్త్ కండిషన్ ను పరిశీలించిన డాక్టర్లు కొన్నాళ్ల పాటూ వెంటిలేటర్ పై చికిత్స అందించాలని తెలిపారు.
అయితే శ్రీతేజ్ హాస్పిటల్ చేరి ఇవాల్టికి 57 రోజులు అవుతుంది. ఇప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగవలేదు. బాబు కళ్లు తెరిచి ఎక్కువ సేపు నిలకడగా ఉండగలుగుతున్నప్పటికీ ఎవరినీ గుర్తు పట్టలేకపోతున్నాడని, కనీసం అతని కుటుంబ సభ్యుల్ని కూడా శ్రీతేజ్ గుర్తు పట్టడం లేదని డాక్టర్లు చెప్తున్నారు.
ఇప్పటికీ శ్రీతేజ్ లిక్విడ్ రూపంలోనే ఫుడ్ తీసుకుంటున్నాడని, అది కూడా ముక్కు ద్వారా ఏర్పాటు చేసిన ఓ పైప్ ద్వారా అని తెలుస్తోంది. శ్రీతేజ్ హాస్పిటల్ లో చేరి ఇప్పటికే దాదాపు రెండు నెలలవుతున్నా ఇంకెప్పుడు నయమవుతుందనేది డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. ఈ ఘటన వల్ల బన్నీ(Allu Arjun) అరెస్ట్ అయి, తర్వాత బెయిల్ పైన బయటికొచ్చిన విషయం తెలిసిందే.













