War2: వార్2 స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ స్పెషల్ ప్లాన్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హంక్ హృతిక్(Hrithik Roshan) రోషన్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న సినిమా వార్2(War2). ఎన్టీఆర్ ఈ సినిమాతోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో వార్2పై తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలున్నాయి. బ్లాక్ బస్టర్ వార్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న వార్2 సినిమాను అయాన్ ముఖర్జీ(Ayaan Mukherjee) చాలా భారీ రేంజ్ లో తెరకెక్కించాడు.
అంతేకాదు, ఆర్ఆర్ఆర్(RRR) లో నాటు నాటు(Naatu Naatu) లాంటి పాటను వార్2లో ఎన్టీఆర్, హృతిక్ పై ప్లాన్ చేసి ఉన్న అంచనాలను రెట్టింపు చేసిన అయాన్ ముఖర్జీ రీసెంట్ గానే ఆ సాంగ్ ను యష్ రాజ్ స్టూడియో(Yash Raj Studio)లో వేసిన స్పెషల్ సెట్ లో షూట్ చేశారు. గత కొన్నాళ్లుగా ఈ పాట గురించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సాంగ్ ను ట్రైలర్ కంటే ముందు రిలీజ్ చేసి హైప్ ను పెంచి ఆ తర్వాత ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని అన్నారు.
కానీ తాజా సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. వార్2 లోని స్పెషషల్ సాంగ్ ను మేకర్స్ సినిమా రిలీజ్ కు వారం ముందుగానే విడుదల చేయనున్నారట. ఈ లోపు ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమాపై ఉన్న హైప్ ను పెంచి ఆ తర్వాత రిలీజ్ కు సరిగ్గా వారం రోజుల ముందు ఆ స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేసి వార్2 పై ఉన్న అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేయాలని చూస్తున్నారట. వార్2 సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.