War2: వార్2కు అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్

దేవర(Devara) సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) నుంచి రాబోతున్న సినిమా వార్2(War2). అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్, బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. దీంతో ఇద్దరు టాలెంటెడ్ హీరోలను ఎప్పుడెప్పుడు స్క్రీన్ పై చూస్తామా అని ఈ సినిమా మొదలైనప్పటి నుంచే అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
దానికి తోడు ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. అయితే వార్2 కోసం బాలీవుడ్ ఆడియన్స్ తో పాటూ టాలీవుడ్ ఆడియన్స్ కూడా చాలా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు చాలా టైమ్ ఉన్నప్పటికీ అప్పుడే ఈ సినిమాకు తెలుగు స్టేట్స్ లో స్పెషల్ షోలకు మంచి డిమాండ్ నెలకొందని తెలుస్తోంది.
ఇప్పటికే ఏపీలోని చాలా ఏరియాల్లో స్పెషల్ షోల కోసం థియేటర్ యాజమాన్యాలతో ఫ్యాన్స్ డిస్కషన్స్ చేస్తున్నారని సమాచారం. రిలీజ్ కు మరో 40 రోజుల ముందుగానే ఇంత క్రేజ్ ఉందంటే ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) నిర్మించిన ఈ సినిమాలో హృతిక్(Hrithik) సరసన కియారా అద్వానీ(Kiara Advani) నటించగా, ప్రీతమ్(preetham) వార్2కు సంగీతం అందించారు.