విశ్వంభర తెలుగు రాష్ట్రాల హక్కులకు హై డిమాండ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు థియేట్రికల్ బిజనెస్ ను నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ మొదలుపెట్టినట్లు సమాచారం.
ఇంకా రేటు విషయం ఫైనల్ అవలేదు కానీ నైజాం రైట్స్ మైత్రీ సంస్థకు ఇచ్చి, సీడెడ్ తో కలిపి ఆంధ్ర అన్ని ఏరియాల హక్కులను ధీరజ్ మొగిలినేనికి ఇవ్వాలని డీల్ కుదుర్చుకునే ప్రతిపాదన ఆల్మోస్ట్ ఓకే అయిందని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సుమారు రూ.120 కోట్ల వరకు నిర్మాతలు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంకా ఫైనల్ కాలేదు కానీ రేటు ఎంత తగ్గినా సరే మినిమం వంద కోట్ల నుంచి లెక్క మొదలు కానున్నట్లు తెలుస్తోంది. చిరూ గత చిత్రం భోళా శంకర్ ఫ్లాపైనప్పటికీ ఆ ఎఫెక్ట్ విశ్వంభర మీద పెద్దగా పడ్డట్టు లేదు. పైగా ఈ సినిమా విషయంలో వశిష్ట వర్క్ గురించి చిత్ర యూనిట్ చాలా గొప్పగా చెప్తుంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అందుకే చిరూ కూడా కొత్త సినిమాలేవీ కమిట్ అవకుండా ఈ సినిమాకే తన పూర్తి సమయాన్నికేటాయించాడు. మరి భారీ అంచనాలతో రాబోయే విశ్వంభర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.













