క్లారిటీ ఇచ్చిన విశ్వంభర నిర్మాతలు
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వశిష్ట(Vasishta) దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర(Viswambhara). ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలిపారు. త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉండదని వార్తలొస్తున్నాయి.
విశ్వంభర ఓటీటీ డీల్ వల్ల సినిమా రిలీజ్ లేట్ అవుతుందనే టాక్ గత రెండు రోజులుగా నెట్టింట వినిపిస్తోంది. మేకర్స్ అడిగిన రేటు విషయంలో ఓటీటీ సంస్థలు ధైర్యం చేయలేకపోతున్నాయని కొందరంటుంటే, సినిమాపై కాన్ఫిడెన్స్‌తో మేకర్స్ రేటు విషయంలో అసలు తగ్గడం లేదని, ఓటీటీ డీల్ కారణంగా సినిమాను కొంత కాలం ఆగి రిలీజ్ చేస్తారని వార్తలొచ్చాయి.
అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్(UV Creations) క్లారిటీ ఇచ్చింది. విశ్వంభర చెప్పినట్టు సంక్రాంతికే రిలీజ్ అవుతుందని ఎలాంటి ఆలస్యం ఉండబోదని అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. ఓటీటీ డీల్ పై డిస్కషన్స్ జరిగినా, ఆ డీల్ పూర్తవకపోయినా సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులుండవని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఒక పాట, కొంత టాకీ పార్ట్ మినహా పూర్తైందని సమాచారం.













