Vijay Sethupathi: తెలుగు సినిమాను తెగ పొగిడిన సేతుపతి

చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలోనే మంచి డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్నారు విజయ్ సేతుపతి. సేతుపతి నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ కు ఆ సినిమాపై ఆటోమేటిక్ గా ఆసక్తి ఏర్పడే స్థాయికి ఆయన చేరుకున్నారు.
సినిమాలపై ఆయనకో కచ్ఛితమైన అభిప్రాయం ఉంటుంది. ఆయన నటించిన ఏస్(Ace) సినిమా రీసెంట్ గానే థియేటర్లలోకి వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ సినీ విమర్శకుడు భరద్వాజ్ రంగన్(Bharadwaj Rangan) కు సేతుపతి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మీరు రీసెంట్ గా చూసిన సినిమాల్లో నచ్చినవేంటని భరద్వాజ్ సేతుపతిని అడిగారు.
దానికి సేతుపతి సమధానమిస్తూ తాను రీసెంట్ గా విడాముయార్చి(Vidamuyarchi), కోర్టు(Court) సినిమాలను చూశానని, వాటిలో తనకు కోర్టు సినిమా చాలా బాగా నచ్చిందని, ఆ సినిమాను, క్లైమాక్స్ ను డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేమని అన్నారు. అలాంటి క్లైమాక్స్ రాయడం అంత ఈజీ కాదని డైరెక్టర్ ఆ సీన్ ను ఎంతో మెచ్యూర్డ్ గా తెరకెక్కించారని తెలుగు సినిమాను సేతుపతి తెగ పొగిడేశారు.