Arasan: అరసన్ లో మరో స్టార్
తమిళ స్టార్ హీరో శింబు(Simbhu) అరసన్(Arasan) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేషనల్ అవార్డు విన్నర్ వెట్రిమారన్(Vetrimaran) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడం, అందులో శింబు హీరోగా నటిస్తుండటంతో మొదటి నుంచి అరసన్ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అసలే ఈ సినిమాకు మంచి హైప్ నెలకొన్న నేపథ్యంలో మరో స్టార్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. విజయ్ సేతుపతి ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయిన విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అనిరుధ్(anirudh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా కూడా వెట్రిమారన్ గత సినిమాల్లానే ఉంటుందని మొదటి నుంచి మేకర్స్ చెప్తున్నారు.
తన సినిమాల్లో సమాజంలోని సోషల్ ఇష్యూస్ ను డీల్ చేసే వెట్రిమారన్ ఇందులో కూడా అలాంటి కథతోనే ఆడియన్స్ ను మెప్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక విజయ్ సేతుపతి విషయానికొస్తే ఆయన ప్రస్తుతం పూరీ జగన్నాథ్(puri jagannadh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన వెంటనే శింబు మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు సేతుపతి.






