బర్త్ డేను సర్ ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ! అవాక్కైన సమంత
సమంతను తాజాగా విజయ్ దేవరకొండ సర్ ప్రైజ్ చేశాడు. VD 11 యూనిట్ సెట్లో అందరూ కలిసి సమంత బర్త్ డేను గ్రాండ్గా సెలెబ్రేట్ చేశారు. ఇందులో భాగంగా ఓ డ్రామా ప్లే చేశారు. సమంతను తాజాగా తన చిత్రయూనిట్ సర్ ప్రైజ్ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్న సంగతి తెలిసిందే. టక్ జగదీష్ ఫ్లాప్ తరువాత శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న చిత్రమిదే. ఇక మజిలీ సినిమా తరువాత శివ నిర్వాణ మళ్లీ సమంతతో సినిమా చేస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ, సమంతలు కలిసి నటిస్తోన్న ఈ సినిమాను ఇటీవలె ప్రారంభించారు. ఈ మూవీ యూనిట్ సమంతకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చిన బర్త్ డేను గ్రాండ్గా సెలెబ్రేట్ చేసింది. ఇందులో రిహార్సల్స్ అని చెప్పి సమంతను బక్రా చేసేశారు. ఇక విజయ్ దేవరకొండ అయితే నిజంగానే ప్రపోజ్ చేసినట్టుగా ఫీలయ్యాడు. దీంతో సమంత దెబ్బకు షాక్ అయ్యారు. ఏంటి ఇదంతా అని విజయ్ దేవరకొండను అనేసింది.
https://twitter.com/













