అమెరికాలో విజయ్ దేవరకొండ సందడి

టాలీవుడ్ హీరో విజయ దేవరకొండ అమెరికాలో సందడి చేశారు. ఈ యంగ్ హీరోకు అంతర్జాతీయ స్థాయిలో అభిమానులున్న సంగతి తెలిసిందే. అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. విజయ్ ను చూసిన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడయాలో వైరల్‌గా మారాయి. అమెరికా లో విజయ్ క్రేజ్ అంటూ నెటిజన్లు వాటిని షేర్ చేస్తున్నారు.