మాంగో ఐస్ క్రీం ‘బీ ది రియల్ మెన్’ అనిపించుకున్న విజయ్ సాయి దేవర కొండ
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ‘బీ ది రియల్ మెన్’ అనే ఛాలెంజ్ కొనసాగుతుంది రోజుకొక సెలబ్రిటీ తమ తమ పద్ధతుల్లో ఈ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రాజా మౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, కొరటాల శివ, సుకుమార్, అనిల్ రావి పూడి, సంపూర్ణేష్ బాబు, నిర్మాత శోభు యార్లగడ్డ, క్రిష్ వీళ్లంతా ఛాలెంజ్ ను స్వీకరించి ఇల్లు ఊడ్వడం, పాటు ఇంట్లో బాసాన్లు కడగటం బట్టలు ఉతకటం తోట పనులు చేయడం తో బాటు వంట చేయడం వంటి పనులు కుల వృత్తి లో పట్టేగొలుసులు చేస్తున్నారు. ఈ రోజు రౌడీ విజయ సాయి దేవర కొండ ఏం చేస్తుందంటే సాధారణమైన రోజులు కేవలం 6 గంటలు పడుకునే విజయ్ లాక్ డౌన్ కారణంగా 9 గంటల 30నిముషాలు నిద్రపోతున్నాడంటా…సరే ఈ లాక్ డౌన్ షెడ్యూల్లో ఉదయమే లేచి గతంలో కాళీ చేసినా వైన్ విస్కీ సీసాల్లో ఒక లీటర్ మంచి నీళ్లు తాగి, తరువాత పక్క బట్టలు దులుపుకుని డస్ట్ బిన్ సవరించి….ఎవరో స్నేహితుడు చెప్పిన మాంగో ఐస్ క్రీం తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తరువాత ఇంటి పనులు చేసి తన తల్లి దండ్రులకు తమ్ముడికి మాంగో ఐస్ క్రీం సర్వ్ చేయడంతో ‘బీ ది రియల్ మెన్’ అని చాటాడు తిరిగి తన తమ్ముడు ఆనంద్ దేవరకొండకు ఛాలెంజ్ విసిరాడు. అదీ విషయం.













