నయనతారను అడగాలి…
తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో నయనతార ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే తమ మధ్య ఉన్న అనుబంధంపై వీరిద్దరూ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. ఎట్టకేలకు పెళ్లి వార్తలపై విఘ్నేష్‌శివన్ స్పందించారు. పెళ్లి గురించి ముందు నయనతారను అడగాలి. ఆ తర్వాత మా అమ్మను అడిగి అప్పుడు చెబుతా అని తెలిపారు. అలాగే నయతార అంటే నాకు చాలా గౌరవం. అలాంటి గొప్ప వ్యక్తిని కలవడం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా స్ఫూర్తిదాయమైన మహిళ. వ్యక్తిగత జీవితంలోని బాధలు, సమస్యల్ని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. అలాంటి ఆత్మస్థైర్యం మరొకరిలో ఉంటుందా అనిపిస్తుంది అని తెలిపారు.













