నయనతార…. తీపి కబురు
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతారతో యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి తెలిసిందే. ఈ జంట పెళ్లాడేందుకు ఇంకెంతో సమయం పట్టదని నాలుగేళ్లుగా ప్రచారం సాగుతూనే ఉంది. అయితే పెళ్లి గురించి మాత్రం వీరిద్దరూ చెప్పడం లేదు. కానీ పండుగలు, ఇతర సందర్భాల్లో నయన్, విఘ్నేష్‌లు విదేశాలకు వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసి వస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ ఏడాది నిశ్చితార్థం చేసుకొని వచ్చే ఏడాది పెళ్లాడే ఆలోచనలో ఉన్నారని సమాచారం. పెళ్లి లోపు అరడజను సినిమాలను పూర్తి చేయాలని నయనతార భావిస్తోందట.













