Ram Charan vs Ajith: చరణ్‌కి అజిత్‌తో పోటీ తప్పేలా లేదు
ఈ సంక్రాంతికి అందరికంటే ముందుగా రిలీజ్ కానున్న గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాకు సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తే ఓపెనింగ్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని అందరూ ఫిక్సైపోయారు. గేమ్ ఛేంజర్ తర్వాత రెండు రోజులకు డాకు మహారాజ్(Daku Maharaj), నాలుగు రోజులకు సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) రిలీజవడం కూడా ఈ సినిమాకు సానుకూల అంశమే.
తెలుగులో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కానీ తమిళంలో మాత్రం చరణ్(charan) సినిమా అజిత్(Ajith) సినిమాతో డైరెక్ట్ క్లాష్ అయ్యే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. అజిత్ నటించిన విడాముయార్చి(Vidamuyarchi)ని కూడా జనవరి 10కే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అదే జరిగితే గేమ్ ఛేంజర్ తమిళ వెర్షన్ కు స్క్రీన్ల్ పరంగా ఇబ్బందులు తప్పవు.
తమిళనాడు, కేరళలో అజిత్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనకే ఎక్కువ స్క్రీన్స్ దక్కుతాయి. హైప్ పరంగా చరణ్ సినిమా కంటే అజిత్ సినిమా వెనుకబడినప్పటికీ ప్రమోషన్స్ తో హైప్ ను పెంచాలని లైకా సంస్థ చాలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు పండగ రేసులోకి రామ్ చరణ్(ram charan), బాలకృష్ణ(balakrishna), వెంకటేష్(Venkatesh) తో పాటూ అజిత్ కూడా ఉన్నాడని స్పష్టమవుతుంది.













