Venu Sriram: థియేటర్ నాకు గుడి లాంటిది

ఎంసీఏ(MCA), వకీల్‌సాబ్(vakeel saab) సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వేణు శ్రీరామ్(Venu Sriram) ఇప్పుడు తమ్ముడు(Thammudu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నితిన్(Nithin) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న వేణు శ్రీరామ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు.
తనకు సినిమాతో విడదీయలేని అనుబంధముందని, కనీసం వారానికి ఒకసారైనా థియేటర్ కు వెళ్లకపోతే తాను అనారోగ్యం పాలవుతానని, థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుందని ఆయన చెప్పారు. బిగ్ స్క్రీన్ పై సినిమాలు చూడడం కేవలం తనకు అలవాటు మాత్రమే కాదని, అది తనకు ఓ అవసరంగా మారిందని ఆయన తెలిపారు.
డైరెక్టర్ గా సినిమాలు చేయడం కంటే, సినిమాలను బిగ్ స్క్రీన్ పై చూడ్డానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తానని, ఐమ్యాక్స్(IMAX) లో సినిమాలను ఎంజాయ్ చేయడం కోసం తాను రెగ్యులర్ గా చెన్నై, ముంబై వెళ్తూ ఉంటానని, థియేటర్ అనేది తనకు గుడి లాంటిదని, దానికి ఎక్కువ రోజులు దూరంగా ఉంటే మనశ్శాంతిగా ఉండదని శ్రీరామ్ వేణు చెప్తున్నారు.