VenkyTrivikram: త్రివిక్రమ్- వెంకీ మూవీకి ముహూర్తం ఫిక్స్

ఈ ఏడాది పండక్కి సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకోవడమే కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు విక్టరీ వెంకటేష్(Venkatesh). ఆ సక్సెస్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలని వెంకటేష్ తన తర్వాతి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే తన నెక్ట్స్ మూవీని గురూజీ త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో ఫైనల్ చేశారు.
ఇప్పటికే త్రివిక్రమ్- వెంకీ(Venky) సినిమాను అనౌన్స్ చేయగా, మొన్నా మధ్య ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తోన్న మొదటి సినిమా కావడంతో దీనిపై అందరికీ భారీ అంచనాలున్నాయి. వాస్తవానికి వీరిద్దరూ కలిసి గతంలో నువ్వు నాకు నచ్చావ్(Nuvvu Naku Nachav), మల్లీశ్వరి(Malleswari) సినిమాలు చేశారు కానీ ఆ రెండు సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా మాత్రమే వర్క్ చేశారు.
త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారాక వెంకీతో చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో గతంలో వారి కలయికలో వచ్చిన సినిమాల్లానే ఇది కూడా క్లాసిక్ సినిమా అవుతుందని అందరూ ఆశ పడుతున్నారు. వెంకీ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఓ అప్డేట్ తెలుస్తోంది. అక్టోబర్ 6 నుంచి వెంకీ 77(Venky77) సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని, ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుందని సమాచారం.