వివేకానంద బయోపిక్ పై వెంకటేష్ క్లారిటీ
హిందూ మతాన్ని గౌరవనీయమైన మతంగా స్థాపించి, సోదరభావం, స్వీయ- మేల్కొలుపు అతని సందేశంగా ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద లాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరపైకి తీసుకురావాలని కొన్నేళ్ల కిందటే డైరెక్టర్ నీలకంఠ ట్రై చేశాడు. వివేకానందగా నటించడానికి విక్టరీ వెంకటేష్ ను కూడా ఒప్పించాడు.
కథ బాగా నచ్చడంతో వెంకటేష్ ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే చేద్దామనుకున్నాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. తర్వాత ఈ ప్రాజెక్ట్ వేరే డైరెక్టర్ చేతుల్లోకి వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత వివేకానంద ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ వినిపించలేదు.
తాజాగా సైంధవ్ ప్రమోషన్స్ లో వెంకటేష్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. స్వామి వివేకానంద కథ ఓ స్థాయి వరకు వచ్చి ఆగిందని, అక్కడి నుంచి కథ ముందుకు వెళ్లడం లేదన్నారు. గతంలో ఈ సినిమా కథ కోసం ఇద్దరు పనిచేస్తున్నట్లు చెప్పిన వెంకీ ఇప్పుడీ మాట చెప్పడంతో ఈ సినిమా కథ విషయంలో వెంకటేష్ ఇంకా శాటిస్ఫై కాలేదని తెలుస్తోంది.













