పల్లెటూరి కథతో రానున్న వెంకీ, అనిల్
ఈ ఏడాది సైంధవ్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్టరీ వెంకటేష్, ఆ సినిమాతో డిజాస్టర్‌ను అందుకున్నాడు. అయితే వెంకటేష్ వచ్చే ఏడాది మరో సినిమాతో సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ తన తర్వాతి సినిమాను సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయడానికి ఓకే చెప్పాడు.
దిల్ రాజు బ్యానర్ లో నిర్మాణం జరగబోతున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ కానుందని సమాచారం. ఇప్పటికే వెంకీ, అనిల్ కాంబోలో ఎఫ్2, ఎఫ్3 సినిమాలొచ్చాయి. దీంతో ఈ కాంబోపై మంచి అంచనాలున్నాయి. అయితే ఈసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కామెడీ ఎంటర్టైనర్ కాదని తెలుస్తోంది.
వెంకీ కోసం అనిల్ పల్లెటూరి నేపథ్యంలో సాగే మంచి స్టోరీని రెడీ చేశాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట ప్రచారం అవుతోంది. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటూ చక్కని సందేశం కూడా ఉండనుందట. పల్లెటూరు, తల్లిదండ్రులను వదిలి పట్నం వెళ్ళాక పుట్టి పెరిగిన గ్రామాన్ని మర్చిపోవద్దనే మెసేజ్‌ను ఇవ్వనున్నాడట అనిల్ రావిపూడి. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.













