మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న వెంకీ, తరుణ్
ఈ సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల్లో డిజాస్టర్ గా మిగిలింది వెంకటేష్ హీరోగా వచ్చిన సైంధవ్ మాత్రమే. ఈ సినిమా సుమార్ రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ రాబట్టింది మాత్రం రూ.8 కోట్లు మాత్రమేనని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. డైరెక్టర్ శైలేష్ ను బాగా నమ్మిన వెంకటేష్, దానికి తగ్గ రిజల్ట్ ను అందుకోలేకపోయాడు.
ఈ విషయం దగ్గుబాటి ఫ్యాన్స్ ను బాగా నిరాశ పరిచింది. అయితే వెంకీ ల్యాండ్ మార్క్ మూవీ అయిన 75వ సినిమాకు డైరెక్టర్ గా ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్న టైమ్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చెప్పిన లైన్ సురేష్ బాబుకు బాగా నచ్చిందన్న విషయం తెలిసిందే. కానీ ఆ స్టోరీ సెకండాఫ్ ని ఎంత డెవలప్ చేసినప్పటికీ అది శాటిస్ఫైయింగ్ గా రాకపోవడంతో దాన్ని ఆపేశారు.
గుర్రపు పందేలు, మాఫియా చుట్టూ తిరిగే డిఫరెంట్ స్టోరీగా దాన్ని తరుణ్ రాసుకున్నాడు. కానీ దాన్ని డెవలప్ చేయడంలో ఫెయిల్ అవడంతో అప్పటికే చాలా టైమ్ వేస్ట్ అయిందని కీడా కోలా తీశాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా ఓ మోస్తరు టాక్ తో బయటపడింది. ఓ వైపు వెంకీ సినిమా, మరోవైపు తరుణ్ సినిమా రెండూ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని తెచ్చుకోలేకపోయాయి. ఇలా కాకుండా తరుణ్ భాస్కర్ కాస్త శ్రద్ధ పెట్టి వెంకీ కోసం రాసుకున్న లైన్ ను డెవలప్ చేసి ఉంటే ఇద్దరూ మంచి రిజల్ట్ ను అందుకునే వారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సైంధవ్ తర్వాత వెంకీ తన నెక్ట్స్ మూవీ ఎవరితో చేయనున్నాడనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.













