వరుణ్ కెరీర్‌ను మార్చేసిన ఆ రెండు సినిమాలు
ముకుంద అనే యావరేజ్ సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన వరుణ్ ఖాతాలో ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 లాంటి హిట్స్ ఉండటంతో అతడికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. సినిమా సినిమాకూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కొత్త దారిలో వెళ్లిన ఈ మెగా ప్రిన్స్‌కు ఇప్పుడు అసలు ఏ సినిమా చేసినా కూడా కలిసి రావడం లేదు. వరుసగా రెండు సినిమాలు వరుణ్ కెరీర్ ను, మార్కెట్ ను బాగా దెబ్బ తీశాయి. ఈ ఎఫెక్ట్ తన తర్వాతి సినిమాలపై పడనుంది. గతేడాది సమ్మర్ లో వచ్చిన ఎఫ్3 మూవీపై భారీ అంచనాలుండగా, ఆ సినిమా ఫర్వాలేదనిపించింది. కానీ తర్వాత వరుణ్ సోలో హీరోగా వచ్చిన గని సినిమా మాత్రం వరుణ్ కు దారుణమైన ఫ్లాప్ ను అందించింది.
ఇక రీసెంట్గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గాండీవధారి అర్జున సినిమాకైతే మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. వరుణ్ ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు. తన కష్టం ఈసారి ఎలాగైనా సక్సెస్ ని ఇస్తుందని ఎంతో నమ్మకం కూడా పెట్టుకున్నాడు కానీ ఈ మూవీ గని కంటే డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాల ఫలితం వరుణ్ చేయబోతున్న వాలైంటెన్, మట్కా సినిమాల మీద, ఆ నిర్మాతల మీద చాలా ప్రభావం చూపుతోంది. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే. ఈ సినిమాలకు ఆ బడ్జెట్ మేర బిజినెస్ చేయగలమా లేదా అని ఇప్పుడు ఆయా నిర్మాతలు టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.













