నేను ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తే అతనికి మాత్రమే చెబుతా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని ఆయన అభిమానులు మాత్రమే కాదు యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. అయితే తాజాగా ఒక తమిళ హీరోయిన్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఐ లవ్ యూ అంటూ చెప్పాల్సి వస్తే అది ఒక్క ప్రభాస్‌కు మాత్రమే చెబుతాను అని. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తమిళ్ బ్యూటీ వరలక్ష్మి శరత్‌కుమార్. తన అందం అభినయంతో తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ భామ తన బ్యాక్‌గ్రౌండ్‌ను పెద్దగా పట్టించుకోకుండా హీరోయిన్ పాత్రలు వస్తేనే చేస్తానని అనుకోకుండా హీరోయిన్ నుంచి విలన్ పాత్రల వరకు అన్ని క్యారెక్టర్స్ చేస్తోంది. ఇక ఇటీవల సర్కార్ చిత్రంలో ఆమె విలనిజం చూస్తే ఔరా అనక మానరు. అంత బాగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక తాజాగా ఈభామ ప్రభాస్‌కు మాత్రమే ఐ లవ్ యూ చెబుతానని పేర్కొంది. ఎందుకంటే ప్రభాస్ అంటే తనకు అంత ఇష్టమని వరలక్ష్మి చెప్పడం విశేషం.













