ప్రాణం ఖరీదు టీజర్ విడుదల చేసిన వందేమాతరం
నందమూరి తారకరత్న కీలక పాత్రధారిగా ప్రశాంత్, అవంతిక జంటగా రూపుద్దిద్దుకొన్న ప్రాణం ఖరీదు చిత్రం సాంగ్ టీజర్‌ను సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకు నేనే సంగీత దర్శకుడిని. పాటల్ని చాలా బాగా చిత్రీకరించారు. అందులో రెండు పాటల టీజర్స్ నేను విడుదల చేయడం ఆనందంగా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం విజయం సాధించాలి అన్నారు. ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్‌గారు ఇచ్చిన సంగీతం బాగా హెల్ప్ అయింది. చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. త్వరలో విడుదల చేస్తాం అని హీరో ప్రశాంత్ చెప్పారు. పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎల్.కె.రెడ్డి దర్శకుడు.













