Ustaad Bhagath Singh: మార్చిలో ఉస్తాద్ భగత్‌సింగ్?
టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ అనేది చాలా పెద్ద ఇబ్బందిగా మారింది. ముందొక డేట్ ను చెప్పడం, తర్వాత సినిమా రెడీ అవలేదని చెప్పి వాయిదా వేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పటికే ఈ కారణాలతో తెలుగులో ఎన్నో సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకోగా, ఆ ఎఫెక్ట్ మరెన్నో సినిమాలపై పడింది. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే ఎదురయ్యేలా కనిపిస్తుంది.
నెక్ట్స్ ఇయర్ మార్చి నెలాఖరుకి ఆల్రెడీ రెండు పెద్ద బడ్జెట్ సినిమాలు షెడ్యూలైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ రెండింటికి మరో సినిమా తోడవుతుందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan) తన తర్వాతి సినిమా అయిన ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad bhagath Singh) ను మార్చిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అదే నిజమైతే భారీ పోటీ తప్పదు.
అయితే ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించుకుంటే ది ప్యారడైజ్(the paradise) మూవీ షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉందని, చెప్పిన డేట్ కు సినిమా రావడం కష్టమని, వాయిదా తప్పదని కొంతకాలంగా వార్తలొస్తుండగా, తన బాబాయి సినిమా రిలీజవుతుంటే క్రేజ్ ఎలా ఉంటుందో స్వయంగా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన చరణ్(ram charan) తన సినిమాను పోటీగా రిలీజ్ చేయడు. మరి ఇలాంటి సిట్యుయేషన్స్ లో మార్చి నెలలో ఎవరు సినిమాలను రిలీజ్ చేస్తారనేది చూడాలి.






