Ustaad Bhagath Singh: గ్రాండ్ గా ఇయర్ ను ఎండ్ చేయనున్న ఉస్తాద్ భగత్‌సింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) రీసెంట్ గానే ఓజి(OG) సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకోవడమే కాకుండా ఆ సినిమాతో ఎంతో కాలంగా మంచి ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కసిని కూడా తీర్చాడు. ఓజి హిట్ అవడంతో ఇప్పుడందరి ఫోకస్ ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagathsingh) వైపు మళ్లింది. హరీష్ శంకర్(Harish Sankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆల్రెడీ గతంలో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్(Gabbar singh) సినిమా రాగా, ఇప్పుడు మరోసారి వీరి కలయికలో సినిమా రానుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై మొదటి నుంచి మంచి హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పుడో సాలిడ్ అప్డేట్ టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఇయర్ ఎండింగ్ కు మేకర్స్ ఓ ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
2025 ఇయర్ ను ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజికల్ బ్లాస్ట్ తో ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ సినిమా నుంచి డిసెంబర్ 31న మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆల్బమ్ అదిరిపోయేలా ఉంటుందని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారట. చూస్తుంటే ఇయర్ ఎండింగ్ కు ఉస్తాద్ భగత్‌సింగ్ పార్టీ వైబ్ ఉండటం ఖాయంగానే అనిపిస్తోంది.







