ఉస్తాద్ కోసం నిర్ణయాన్ని మార్చుకున్న పవన్
ఓ పక్క పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఎప్పుడు ఏ సినిమా షూటింగ్ లో ఉంటారో ఆయనకే తెలియనంత బిజీగా పవన్ తన డేట్స్ ను సెట్స్ చేసుకున్నాడు. రీసెంట్ గానే ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి ఓ షెడ్యూల్ ను పూర్తి చేశాడు పవన్.
ఆ తర్వాత వెంటనే ఓజీ సినిమా కోసం ముంబై వెళ్లి అక్కడ ఆ సినిమా షెడ్యూల్ ను కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు పవన్. ప్రస్తుతం పవన్, ప్రియాంక మీద ఓ సాంగ్ షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ సుజీత్. ఈ సాంగ్ షూట్ తర్వాత తిరిగి హైదరాబాద్ రానున్నాడు పవన్, ఓజీ తర్వాత హరిహర వీరమల్లు కు డేట్స్ ఇస్తారనుకున్నారు మొన్నటి వరకు.
కానీ ఇప్పుడు పవన్ మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ రెండో షెడ్యూల్ కు పది రోజులు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మళ్లీ ఈ షూటింగ్ రెండు నెలల తర్వాత జరగాల్సింది కానీ పవన్ సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో రెండో షెడ్యూల్ కోసం డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రీ నిర్మాతలు ఆ ప్లానింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ వీడియో గ్లింప్స్ టీజర్ మే 11న రిలీజ్ కానుంది.













