Unstoppable: అంచనాలు పెంచేసిన చరణ్ ప్రోమో
అన్‌స్టాపబుల్ సీజన్ 4(Unstoppable4)లో మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ అయిన రామ్ చరణ్(Ram Charan) ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్లో బాలయ్య(Balayya), చరణ్(Charan) కలిసి చేసిన రచ్చ ఎలా ఉంటుందో శాంపిల్ గా ఓ నాలుగున్నర నిమిషాల ట్రైలర్ ను రిలీజ్ చేసింది ఆహా టీమ్. ఈ ఎపిసోడ్‌కు బోనస్ గా శర్వానంద్(Sharwanand), యువి విక్రమ్(UV Vikram) వచ్చి తమ ఫ్రెండ్ కు సంబంధించిన కీలక విషయాలను పంచుకోగా నిర్మాత దిల్ రాజు(Dil Raju) కూడా ఎపిసోడ్ కు వచ్చాడు.
ఇవన్నీ ఫుల్ ఎపిసోడ్‌పై అంచనాలను పెంచేశాయి. చరణ్ తన కూతుర్ని ఫ్యాన్స్ కు ఎప్పుడు పరిచయం చేస్తాడు? చరణ్‌కి పవన్ ఓ యాక్టర్ గా ఇష్టమా లేక పొలిటీషియన్ గా ఇష్టమా? న్యూ ఇయర్ లో చరణ్ ను తన తల్లి ఏం గిఫ్ట్ అడిగింది? ఇలాంటి వాటితో పాటూ బాలయ్య కొత్తగా చరణ్ కి మెగా ఫ్యామిలీ స్టార్ అనే బిరుదు ఇవ్వడం వాటి గురించిన విషయాలు ఉండనున్నాయి.
గత సీజన్స్ లో అన్ని ఎపిసోడ్స్ కు వచ్చిన రెస్పాన్స్ కంటే ఈ ఎపిసోడ్ కు భారీ రెస్పాన్స్ వస్తుందని ఆహా భావిస్తోంది. దానికి తోడు సంక్రాంతికి రెండు రోజుల గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర గేమ్ ఛేంజర్(Game Changer), డాకు మహారాజ్(Daku Maharaj) క్లాష్ అవుతున్న నేపథ్యంలో రిలీజ్ కానున్న ఎపిసోడ్ కావడంతో వ్యూస్ రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని భావిస్తున్నారు.













