విజయ్ ఆఖరి సినిమాకు డిజిటల్ లో ఊహించని రెస్పాన్స్
ఇళయ దళపతి విజయ్(vijay) హీరోగా తెరకెక్కిన ఆఖరి సినిమా జన నాయగన్(jana nayagan) థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఓటీటీలోనూ తన జోరును కొనసాగిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఈ సినిమా ఆయన సినీ జర్నీలో స్పెషల్ మూవీగా నిలిచింది. రిలీజ్ కు ముందు, తర్వాత ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న ఈ సినిమా చివరకు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది. అయితే థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ తో కంపేర్ చేస్తే ఓటీటీలో సినిమాకు లభిస్తున్న ఆదరణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జీ5(Zee5)లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న జన నాయగన్ సినిమాకు భారీ స్థాయిలో వ్యూయర్షిప్ వస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా ఏకంగా 500 మిలియన్‌కు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌ను నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ ఆఖరి సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ భారీ మార్క్‌ను అందుకున్నట్లైంది. థియేట్రికల్ రిలీజ్ చుట్టూ నెలకొన్న పరిస్థితులను దాటి, ఓటీటీలో మాత్రం విజయ్ క్రేజ్ మరోసారి స్పష్టంగా కనిపించిందనే డిస్కషన్ మొదలైంది.
హెచ్. వినోద్(H. Vinoth) దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన పూజా హెగ్డే(pooja hegde) హీరోయిన్గా నటించగా, మమితా బైజు(mamitha byju) కీలక పాత్రలో కనిపించింది. అనిరుధ్(Anirudh) మ్యూజిక్ అందించిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) నిర్మించింది. విజయ్ హీరోగా చివరిసారిగా కనిపించిన సినిమాగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జన నాయగన్, ఇప్పుడు ఓటీటీ వ్యూయర్షిప్తో మరోసారి వార్తల్లో నిలిచింది.








