దుల్కర్ కు మరో లక్కీ ఎస్కేప్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salman) కెరీర్లో మరోసారి లక్కీ ఎస్కేప్ అనే డిస్కషన్ మొదలైంది. జాసన్ సంజయ్(Jason Sanjay) దర్శకత్వంలో సందీప్ కిషన్(Sundeep kishan), ఫరియా అబ్దుల్లా(Faria Abhullah) జంటగా తెరకెక్కిన సిగ్మా(Sigma) అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చింది. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమాకు మిక్డ్స్ రెస్పాన్స్ ఎదురైంది. ముఖ్యంగా కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో లోపాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ తొలుత దుల్కర్ వద్దకు వెళ్లిన విషయం మరోసారి ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి సిగ్మా కథను జాసన్ సంజయ్ ముందుగా దుల్కర్ సల్మాన్‌కు వినిపించాడు. దాదాపు రెండు గంటల పాటు కథను చెప్పిన తర్వాత దుల్కర్ తన అభిప్రాయాలను కూడా షేర్ చేసుకున్నారని జాసన్ వెల్లడించాడు. ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ అప్పట్లో డేట్స్ కుదరకపోవడంతో దుల్కర్ ఈ సినిమాలో భాగం కాలేకపోయారు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా సినిమా పట్టాలెక్కింది.
ఇప్పుడు సిగ్మా(Sigma)కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో దుల్కర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ట్విస్ట్‌గా మారింది. అయితే సినిమా రిజల్ట్ పూర్తిగా హీరో ఎంపికపైనే ఆధారపడుతుందని చెప్పలేం. కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే వంటి అనేక అంశాలు మూవీ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే దుల్కర్ చేసి ఉంటే సినిమా ఫలితం మారేదా? అనే ప్రశ్నకు సమాధానం ఊహగానే మిగిలిపోతుంది. ప్రస్తుతం మాత్రం చేయని ఒక సినిమా రిలీజ్ తర్వాత దుల్కర్ పేరు మరోసారి చర్చలోకి వచ్చింది.








