“చంద్రయాన్” కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునే అర్థవంతమైన సినిమా – ప్రొడ్యూసర్ వేణు ఊడుగుల
ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న హిలేరియస్ అడ్వెంచర్ మూవీ
రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో “చంద్రయాన్” టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన “చంద్రయాన్” సినిమా ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ను ప్రముఖ ఆస్ట్రలాజర్ వేణు స్వామి అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
మ్యూజిక్ డైరెక్టర్ హర్ష ప్రవీణ్ మాట్లాడుతూ – మా సినిమాకు వర్క్ చేసేందుకు ఎంతో సపోర్ట్ గా నిలబడిన మా వేణు ఊడుగుల గారికి థ్యాంక్స్. మా మూవీ మీ అందరి ఆదరణతో ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. అన్నారు.
యాక్టర్ లోకేష్ మాట్లాడుతూ – ఇది నటుడిగా నాకు మొదటి సినిమా. ఈ చిత్రంలో చిన్నా అనే పాత్రలో నటిస్తున్నాను. రవి, శివ, వంశీ అన్నతో కలిసి హీరోయిన్ ను మేమంతా ఆటపట్టించే సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. మందమర్రి నుంచి చందమామ వరకు మేము చేసే విన్యాసాలు, కోతి పనులు చాలా సరదాగా ఉంటాయి. మా సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. అన్నారు.
నటుడు రవి శివతేజ మాట్లాడుతూ – నేను గోదావరి జిల్లాల యాస మాట్లాడుతాననే పేరుంది. ఈ సినిమాలో మాత్రం కంప్లీట్ గా నేటివ్ తెలంగాణ యాసలో నటించాను. ఈ సినిమా నటుడిగా నాకు మంచి పేరు తెస్తుంది. కంటెంట్ ను నమ్మి మా మూవీని సపోర్ట్ చేస్తున్న వేణు ఊడుగుల గారికి థ్యాంక్స్. మా మూవీలో మ్యూజిక్ చాలా బాగుంటుంది. ప్రతి పాటను మీరు ఎంజాయ్ చేస్తారు. హర్ష ప్రవీణ్ మంచి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.
హీరోయిన్ స్వప్న ప్రియదర్శిని మాట్లాడుతూ – తెలుగు సినిమాల్లో నటించాలని కలగంటూ వచ్చాను. ఈ చిత్రంతో నా కల నిజమైంది. తెలుగు సినిమాను మన దేశమే కాదు ప్రపంచమంతా ఇష్టపడుతోంది. ఇలాంటి ఇండస్ట్రీలో భాగమవడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో బిందు అనే పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 30న థియేటర్స్ లోకి వస్తున్న మా సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ డా.పూజారి నాగేశ్వరరావు మాట్లాడుతూ – వేణు అన్న ప్రెజెంట్స్ చేస్తున్నారంటే ఈ సినిమా సక్సెస్ అని అనుకోవచ్చు. ఆయన స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీస్ మన ముందుకు తీసుకొస్తుంటారు. గ్లింప్స్ చూస్తుంటూనే ఈ సినిమా మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందని అర్థమవుతోంది. మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ను మన తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా మీరంతా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం. అన్నారు.
హీరో శివకుమార్ ధీకొండ మాట్లాడుతూ – ఈ చిత్రానికి దాదాపు అందరం కొత్త వాళ్లమే పనిచేశాం. మా లాంటి వాళ్లతో సినిమా చేసిన మా ప్రొడ్యూసర్స్ గట్స్ ను అప్రిషియేట్ చేయాలి. ఈ సినిమాలో హీరోగా నటించాను. నాతో పాటు ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కష్టపడి పనిచేశారు. నిద్రపోయిన సమయం కూడా చాలా తక్కువ. నిజమైన చంద్రయాన్ కంటే మా చంద్రయాన్ చేయడం కష్టం. ఎందుకంటే 40 రోజుల్లో ఏకధాటిగా సినిమా షూటింగ్ చేశారు మా డైరెక్టర్. మా మూవీ అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ కొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాం. అన్నారు.
డైరెక్టర్ శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ – మందమర్రి టు చందమామ, ఆగేది కాదు ఇది ఫుల్ హంగామా. ఈ హంగామా మిమ్మల్ని 2 గంటల 15 నిమిషాలు ఆగకుండా నవ్విస్తుంది. గ్లింప్స్ చూసి మా యాక్టర్స్ అమాయకులు అంటున్నారు. కానీ వీళ్లు అమాయకులే కాదు ధైర్యవంతులు కూడా. ఎవరైనా వీళ్లకు పాకిస్తాన్ మనల్ని ఇబ్బందిపెడుతుంది అంటే దాని మీద బాంబులు వేసి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచించరు. అంత ధైర్యవంతులు. వీళ్లు ఏమీ తెలియకుండా రాకెట్ ఎలా చేశారు, స్పేస్ కు ఎలా వెళ్లారు. ఎక్కాలు రాకుండా రాకెట్ కు కావాల్సిన లెక్కలు ఎలా చేశారు అనేది మీరంతా సినిమాలో చూడబోతున్నారు. అన్నారు.
చిత్ర నిర్మాత ప్రవీణ్ మొలక మాట్లాడుతూ – డైరెక్టర్ శ్రీనాథ్ ఈ కథ చెబుతున్నప్పుడు రెండున్నర గంటలు ఒక ఫ్రెండ్ తో సరదాగా మాట్లాడుకుంటే ఎంత హ్యాపీగా ఫీలవుతామో అలా ఫీలయ్యాను. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఎలాంటి అసభ్యత ఉండదు. థియేటర్ లో ప్రతి ప్రేక్షకుడు నవ్వుకుంటాడని గ్యారెంటీగా చెప్పగలను. అన్నారు.
మూవీ ప్రెజెంటర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ – ఈ సినిమా చూసిన తర్వాత ఈ చిత్రంలో నేను పార్ట్ కావాలని అనిపించింది. ఈ టీమ్ అంతా చాలా కాలంగా నాకు పరిచయం. ఈ టీమ్ నిజాయితీగా, ప్యాషన్ తో ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారని నమ్మాను. ఇది రెగ్యులర్ రొటీన్ సినిమా కాదు. ఒక అర్థవంతమైన సినిమా. అలాగే ఈ చిత్రాన్ని కమర్షియల్ ఇంపాక్ట్ ఉన్న ట్రీమ్ మెంట్ తో రూపొందించారు. వీళ్ల ప్రయత్నం అద్భుతంగా అనిపించింది. అమాయకులైన ఒక నలుగురు యువకులు రాకెట్ తయారు చేసుకుని స్పేస్ లోకి వెళ్లడం అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సైన్స్ తెలియకుండా, పెద్దగా చదువుకోకుండా ఏదో సాధించాలనే తపనతో నలుగురు యువకులు రాకెట్ తయారుచేయడం, స్పేస్ లోకి వెళ్లడం వంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయి. స్పేస్ లోకి వెళ్లేందుకు రాకెట్ తయారుచేసి స్పేస్ లోకి లాంఛ్ చేసే క్రమంలో చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. ఈ జర్నీలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, తెలుసుకున్న విషయాలను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ నెల 30న ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రముఖ ఆస్ట్రలాజర్ వేణు స్వామి మాట్లాడుతూ – ఈ మధ్య చిన్న చిత్రాలు తెలుగులో మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా అలాంటి హిట్ అవుతుంది. ఎందుకంటే గొప్ప నక్షత్రాల్లో పుట్టిన వారు ఈ సినిమా టీమ్ లో ఉన్నారు. మనం ప్రతి రోజూ చంద్రుడు, సూర్యుడిని చూస్తుంటాం. ఆయన ప్రొడ్యూసర్ గా మారితే చంద్రుడు, డైరెక్టర్ గా మారితే సూర్యుడు అనుకోవచ్చు. మా కాంబోలో త్వరలో ఒక పెద్ద సినిమా చేయబోతున్నాం. కృతిక నక్షత్రయుక్త పౌర్ణమి కార్తీకమాసం అక్టోబర్ 30న రిలీజ్ కాబోతోంది కాబట్టి ఈ సినిమా పెద్ద విజయం సాధించబోతోంది. అన్నారు.








