రాకా విషయంలో మేకర్స్ సైలెన్స్.. హీరోయిన్ ఇచ్చిన క్లారిటీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun), డైరెక్టర్ అట్లీ(Atlee) కలయికలో తెరకెక్కుతున్న భారీ సినిమా రాకాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్ లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కథ, పాత్రలు, నటీనటుల ఎంపిక విషయంలో మేకర్స్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో అల్లు అర్జున్ సరసన పలువురు స్టార్ హీరోయిన్లు నటించనున్నారనే ప్రచారం కొంతకాలంగా సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ లేకపోవడంతో క్యాస్టింగ్‌పై రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే దీపికా పదుకొణె(Deepika Padukone), రష్మిక మందన్నా(rashmika mandanna), మృణాల్ ఠాకూర్(mrunal Thakur) వంటి పేర్లు వినిపిస్తుండగా, తాజాగా మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi) పేరు కూడా ఈ లిస్ట్ లో చేరింది. ఆమె ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరగడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ ఊహాగానాలపై రెస్పాండ్ అయిన ఐశ్వర్య లక్ష్మి, తాను రాకా సినిమాలో భాగం కాదని క్లారిటీ చేశారు. అంతేకాకుండా తనను కూడా సినిమాలో తీసుకోవాలంటూ సరదాగా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.
ఒకవైపు మేకర్స్ క్యాస్టింగ్‌పై గోప్యత పాటిస్తుండగా, మరోవైపు ఇలాంటి వార్తలు సినిమాపై డిస్కషన్ ను కొనసాగిస్తున్నాయి. ఐశ్వర్య లక్ష్మి రెస్పాన్స్ తో ఆమెకు సంబంధించిన ప్రచారానికి తెరపడినప్పటికీ, రాకాలో నటించబోయే ఇతర తారల వివరాలపై ఆసక్తి మాత్రం కొనసాగుతోంది. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి అభ్యంకర్(Sai Abhyankar) మ్యూజిక్ అందిస్తున్నారు.








