Venky-Trivikram: వెంకీ కోసం క్రేజీ టైటిల్ ను పట్టేసిన త్రివిక్రమ్

సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki Vasthunnam) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విక్టరీ వెంకేటేష్(Venkatesh) తర్వాతి సినిమాను ఎవరితో చేస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఆ సినిమా హిట్ అవడంతో వెంకీ నుంచి నెక్ట్స్ రాబోయే సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. అయితే వెంకటేష్ తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) తో చేస్తున్నాడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ ఇప్పటికే సినిమాకు సంబంధించిన మిగిలిన పనులన్నీ చక చకా పూర్తవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ కథను రాసేయడం, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ఫినిష్ చేయడం జరిగిపోయాయని, ఈ మూవీకి టైటిల్ ను కూడా లాక్ చేసుకున్నారని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
మేకర్స్ ఈ సినిమాకు వెంకట రమణ(Venkata ramana) అనే టైటిల్ ను అనుకుంటున్నారని, వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని, దాదాపు దాన్నే ఖరారు చేయొచ్చని అంటున్నారు. గతంలో త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకీ(Venky) సినిమాలకు వర్క్ చేయగా, ఆ సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారాక వెంకీతో చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఎదురుచూస్తున్నారు.