ఆ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న త్రిష
ఇరవై ఏళ్లుగా సౌత్ లో హీరోయిన్ గా చలామణి అవుతున్న భామ త్రిష. ఆమె కెరీర్ ముగిసిపోతుందనుకుంటున్న టైమ్ లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ రావడం, ఆ సినిమా తర్వాత అమ్మడుకి ఆఫర్లు క్యూ కట్టడం అంతా చకా చకా జరిగిపోయాయి. ప్రస్తుతం త్రిష బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది.
తమిళంలో విజయ్ తో కలిసి లియోలో నటించిన త్రిష, ప్రస్తుతం అజిత్ సరసన ఓ సినిమా చేస్తుంది. తెలుగులో మెగాస్టార్ చిరూతో కలిసి విశ్వంభరలో నటిస్తుంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలకు కూడా త్రిష సైన్ చేసినట్లు తెలుస్తోంది. త్రిష క్రేజ్, రెమ్యూనరేషన్ కూడా అందుబాటులో ఉండటంతో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
స్టార్ హీరోయిన్లుగా రేసులో ఉన్న వారిలానే త్రిష కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే త్రిషకు ఆఫర్లు వెంట పడటానికి కారణం ఆమె తీసుకుంటున్న రెమ్యూనరేషనే. ఒక్కో సినిమాకు రూ.80 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటుందట త్రిష. ఆమె డేట్స్, కంటెంట్, సినిమా బడ్జెట్ ఇలా అన్ని చూసుకుని వాటిని బట్టి రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుందట త్రిష. మొత్తానికి రెమ్యూనరేషన్ విషయంలో త్రిష చాలా ఆచితూచి వ్యవహరిస్తోందన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.













