త్రిషకు ఆఫర్ల మీద ఆఫర్లు
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న త్రిష మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చి క్రేజ్ లేక ఏవేవో సినిమాలు చేసింది కానీ పొన్నియన్ సెల్వన్ తర్వాత మాత్రం అమ్మడు క్రేజ్ మామూలుగా లేదు. పీఎస్ సినిమాలతో అమ్మడి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. సీనియర్ స్టార్ హీరోలందరూ ఇప్పుడు త్రిషనే కోరుకుంటున్నారు.
దీంతో దర్శకనిర్మాతలకు అమ్మడి కాల్షీట్లు దొరకడం కష్టంగా మారింది. లియోలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన త్రిష, ఇప్పుడు చిరంజీవి సరసన విశ్వంభర సినిమాకు ఓకే చెప్పింది. ఇవాళే సెట్స్ లో అడుగుపెట్టింది. ఇది కాకుండా సల్మాన్ ఖాన్ తో విష్ణు వర్ధన్ తీయబోయే ది బుల్ అనే సినిమాలోనూ త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం. ముందు ఇందులో సమంతని అనుకున్నారు కానీ ఇప్పుడా ప్లేస్‌లోకి త్రిష వచ్చింది.
తమిళంలో అజిత్ తో విదా ముయార్చి చేస్తున్న త్రిష, మలయాళంలో మోహన్ లాల్ సరసన రామ్ లో కూడా నటిస్తోంది. కమల్‌హాసన్ థగ్ లైఫ్ లో, ఐడెంటిటీ అనే మూవీలోనూ త్రిష హీరోయిన్గా నటించనుంది. చూస్తుంటే త్రిష కాల్షీట్స్ మరో రెండేళ్ల వరకు ఇంకెవరికీ దొరికేలా లేవు. నాలుగు పదుల వయసులో కూడా ఈ రేంజ్ డిమాండ్ ఏంటని సగటు యంగ్ హీరోయిన్స్ నోరు వెళ్ళబెడుతున్నారు.













