Toxic: 45 రోజుల లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న టాక్సిక్

కెజిఎఫ్(KGF) సినిమాలతో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యష్(Yash) ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూశారు. కానీ యష్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్(geethu mohandas) తో చేతులు కలిపి టాక్సిక్(Toxic) సినిమాను పట్టాలెక్కించాడు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
కియారా అద్వానీ(kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార(nayanthara) కీలకపాత్రలో కనిపించనుండగా తాజాగా ఈ సినిమా ముంబై షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. టాక్సిక్ చిత్ర యూనిట్ 45 రోజుల పాటూ ఓ భారీ షెడ్యూల్ ను ముంబై లో ప్లాన్ చేసి, దాన్ని బుధవారంతో పూర్తి చేసి తిరిగి బెంగుళూరుకు చేరుకున్నారని, బెంగుళూరు షెడ్యూల్ తో టాక్సిక్ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.
కాగా తాజాగా పూర్తైన ముంబై షెడ్యూలే అతి పెద్ద షెడ్యూల్ అని, ఈ షెడ్యూల్ ను ముంబైలోని మాధ్ ఐలాండ్ మరియు ఫిల్మ్ సిటీలో చేశారని, ఈ షెడ్యూల్ లోనే టాక్సిక్ లోని మెయిన్ యాక్షన్ సీన్స్ ను హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జెజె పెర్రీ(JJ Perry) నేతృత్వంలో పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి టాక్సిక్ ఆఖరి షెడ్యూల్ మొదలవనుండగా, వచ్చే ఏడాది మార్చి 19న టాక్సిక్ రిలీజ్ కానుంది.