Tollywood: ఈ వారం థియేట్రికల్ రిలీజులివే!
లాస్ట్ ఈక్ టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డల్ గా నడిచింది. గత వారం రిలీజైన బాహుబలి ది ఎపిక్(baahubali the epic), మాస్ జాతర(mass jathara) సినిమాల్లో బాహుబలి రీరిలీజ్ కు మిక్డ్స్ రెస్పాన్స్ రాగా, మాస్ జాతర డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడందరి దృష్టి నవంబర్ 7న రిలీజ్ కానున్న సినిమాలపై మళ్లింది. వాటిలో ముందుగా అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేస్తోంది రష్మిక మందన్నా(rashmika mandanna) నటించిన ది గర్ల్‌ఫ్రెండ్(the girl friend).
డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిందని గర్ల్ ఫ్రెండ్ ను ప్రమోట్ చేస్తున్నారు. మౌత్ టాక్ బావుంటే గర్ల్ ఫ్రెండ్ హిట్టయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సుధీర్ బాబు(sudheer babu) జటాధర(Jatadhara) కూడా ఈ వారంలోనే రిలీజవుతోంది. జటాధరకు ప్రీ రిలీజ్ బజ్ బాగా లేకపోయినప్పటికీ, ఫాంటసీ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీ రిలీజయ్యాక మిరాయ్(mirai) లానే మ్యాజిక్ చేస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
అవి కాకుండా తిరువీర్(Tiruveer) ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో(The greatest pre wedding show), విష్ణు విశాల్(vishnu vishal) హీరోగా వస్తోన్న తమిళ డబ్బింగ్ మూవీ ఆర్యన్(Aaryan) కూడా ఈ వారలోనే రిలీజ్ అవుతున్నాయి, వాటితో పాటూ చిన్న సినిమాలు ప్రేమిస్తున్నా(Premisthunna), కృష్ణ లీల(Krishna leela) కూడా ఈ వీక్ లోనే రిలీజ్ కాబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటుందో? ఏ సినిమా ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుని విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.






