అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టి కాంబి లో యు వి క్రియేషన్స్ చిత్రం?

అనుష్క శెట్టి జాతి రత్నాలు కుర్రోడు నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేయబోతోందనే వార్తలు గత కొద్దిరోజులుగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ విషయమై ఓ క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది.’సూపర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అంతే సూపర్ స్పీడుతో పాపులర్ అయింది స్వీటీ అనుష్క. వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ తక్కువ సమయంలోనే ఫేమస్ అయి పలు సౌత్ ఇండియన్ భాషల్లో ఛాన్సులు పట్టేసింది. జేజమ్మగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ బ్యూటీ.. ఈ మధ్యకాలంలో కాస్త సినిమాల జోష్ తగ్గించింది. ‘నిశ్శబ్ధం’ మూవీ తర్వాత అనుష్క సైలెంట్ కావడంతో ఇక ఆమె సినిమాలు చేయదని అంతా అనుకున్నారు. పైగా ఆమె తల్లి దండ్రులు పెళ్లి సంభందాలు చూస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఇంతలో జాతి రత్నాలు కుర్రోడు నవీన్ పోలిశెట్టితో ఆమె ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. తాజాగా ఈ సినిమా టైటిల్ విషయమై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ సినిమాలతో సత్తా చాటి తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న నవీన్ పోలిశెట్టికి వరుస ఆఫర్స్ వస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్ అనుష్కతో నటించే అరుదైన అవకాశం దక్కిందని అంటున్నారు.
ఈ చిత్రానికి ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేశ్ దర్శకత్వం వహించనుండగా, యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నారు. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారం.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రీజీ అప్డేట్ బయటకొచ్చింది. 20 సంవత్సరాలు వ్యత్యాసమున్న స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ పుట్టడం, ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొనే పరిమాణాలు ఏంటి? అనే సబ్జెక్ట్ తీసుకొని కథ సిద్ధం చేశారట డైరెక్టర్. అలాగే కథకు యాప్ట్ అయ్యేలా ఈ చిత్రానికి ”మిస్ శెట్టి ..మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే అనుష్క మరో వినూత్న ప్రయోగం చేయబోతోందని చెప్పుకోవచ్చు.