టీజర్ తో హైప్ ను పెంచిన టైగర్ నాగేశ్వరరావు
వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాస్ మహారాజా రవితేజ ఈసారి కమర్షియల్ సినిమాకు దూరంగా పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వంశీ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. అక్టోబర్ 20న దసరా సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇప్పటి వరకు రిలీజైన ప్రతి కంటెంట్ ఈ సినిమా మీద అంచనాలను పెంచుతోంది.
తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా స్టువర్ట్పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు గురించి. అయిదారు దశాబ్ధాల క్రితం మద్రాస్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న నాగేశ్వరరావు దేనికైనా తెగించే గజదొంగ. తనకు ఏదైనా దోచుకోవాలనిపించడం ఆలస్యం ఎంతకైనా తెగించి దాన్ని దక్కించుకుంటాడు.
ఎనిమిదేళ్ల వయసులోనే తలలు నరికి రక్తం కళ్లచూసిన టైగర్ నాగేశ్వరరావు ఎంతో తెలివైనవాడని, తప్పించుకున్న అతన్ని పట్టుకోవడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అయిన మురళీ శర్మకు అర్థమవుతుంది. నాగేశ్వరరావును పట్టుకోవడం మురళీశర్మకు సవాల్ గా కనిపిస్తుంది. అసలు నాగేశ్వరరావు అంత పెద్ద గజ దొంగగా మారడానికి కారణమేంటన్నది మాత్రం తెరపైనే చూడాలి.
రవితేజ టీజర్ లో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మాథీ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ గా ఉంది. జీవీ ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ ని హైలైట్ చేసింది. సినిమాలో రవితేజను డైరెక్టర్ ప్రెజెంట్ చేసిన తీరు మాస్ మహారాజా ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తుంది. మొత్తానికి చిన్న టీజర్ తోనే టైగర్ నాగేశ్వరరావు హైప్ ను మేకర్స్ బాగా పెంచారు.













