Thug Life: థగ్ లైఫ్ కు దాని వల్ల ఎంత నష్టమంటే

కమల్ హాసన్(Kamal Hassan) హీరోగా మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా థగ్ లైఫ్(Thug Life). శింబు(Simbhu), త్రిష(Trisha), అభిరామి(Abhirami) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్ తన కెరీర్లో అన్నింటికంటే ఎక్కువగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా కర్ణాటకలో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
కన్నడ భాష కూడా తమిళ భాష నుంచే పుట్టిందని కమల్ చేసిన కామెంట్స్ కన్నడ ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేయడంతో ఈ విషయంలో కమల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ ఆయన మాత్రం తానేం తప్పు మాట్లాడలేదని, సారీ చెప్పేదే లేదని పట్టుబట్టడంతో థగ్ లైఫ్ సినిమాను కర్ణాటక రాష్ట్రమంతటా బ్యాన్ చేసి కమల్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.
మొత్తానికి థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో రిలీజ్ కావడం లేదు. దీని వల్ల థగ్ లైఫ్ సినిమాకు రూ. 15 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. వారం తర్వాత ఈ సినిమా కర్ణాటకలో రిలీజ్ అవుతుందని టాక్ వచ్చింది కానీ ఇప్పుడు ఆ సూచనలు కూడా కనిపించడం లేదు. ఏదేమైనా ఈ విషయంలో కమల్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పి ఉంటే విషయం ఇక్కడికి వరకు వచ్చేది కాదు.