Short Film Festival: ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ను ప్రారంభించిన ప్రభాస్
ప్రతిభ గల రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందిన ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఈ ఫిలిం ఫెస్టివల్ ను రెబల్ స్టార్ ప్రభాస్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఫిలింమేకర్ అయినా ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనవచ్చు. 2 నిమిషాలకు మించిన నిడివి గల లఘు చిత్రాలను ఏ జానర్ లో అయినా పంపించవచ్చు. 90 రోజుల పాటు ఈ కాంటెస్ట్ జరగనుంది. ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ను ప్రారంభించిన అనంతరం స్పెషల్ వీడియో ద్వారా తన విశెస్ అందించారు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ కార్యక్రమం గురించి దర్శకులు సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తమ స్పందన తెలియజేశారు.
ప్రభాస్ మాట్లాడుతూ – ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఎంతోమంది న్యూ ఫిలింమేకర్స్ కెరీర్స్ కు పునాదిలా మారబోతోంది. వెండితెరపై ప్రతి గొంతు వినిపించాలి, ప్రతి ఒక్కరి కల నిజం కావాలి, కొత్త కథల్ని చెప్పాలనుకుంటున్న ప్రతిభావంతులకు ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఆహ్వానం అందిస్తోంది. అని అన్నారు.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – ఫిలింమేకింగ్ ప్రాసెస్ లో షార్ట్ ఫిలింస్ చేయడం మొదటి అడుగు. మీరు క్రియేటివ్ గా రాసుకునే స్క్రిప్ట్, దాన్ని అంతే పర్పెక్ట్ గా తెరకెక్కించడం, రెండూ భిన్నమైనవి. సినిమా రంగంలోకి రావాలనుకునే ఔత్సాహిక ఫిలింమేకర్స్ కు ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఒక మంచి వేదికగా చెప్పుకోవచ్చు. అన్నారు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ – ఒక షార్ట్ ఫిలిం చూసి అనుదీప్ గురించి తెలుసుకున్నాను. అలా ఆయన దర్శకత్వంలో జాతిరత్నాలు మూవీ చేశాం. ఫిలిం స్కూల్ లో చదువుకోవడం కంటే మీరు వర్క్ చేసి నేర్చుకునేది ఎక్కువ అనుభవాన్ని ఇస్తుంది. ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఫిలిం ఫెస్టివల్ అవకాశం మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. అన్నారు.
డైరెక్టర్ హను రాఘవపూడి మాట్లాడుతూ – ఎంతోమంది కొత్త వాళ్లు ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలని, దర్శకత్వం వహించాలని కోరుకుంటారు. ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొని మీ సృజనాత్మకతను ప్రదర్శించండి. ఆల్ ది బెస్ట్. అన్నారు.
ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కు పార్టనర్ గా వ్యవహరిస్తున్న క్విక్ టీవీ ఈ ఫిలిం ఫెస్టివల్ నుంచి ఎంపికైన 15 మంది ఫిలింమేకర్స్ తో గంటన్నర నిడివి గల సినిమాలను నిర్మించనుంది. ఇలా ఆ 15 మంది కొత్త ఫిలింమేకర్స్ అవకాశం దక్కించుకోనున్నారు. ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ వెబ్ సైట్ ద్వారా ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.






