Thandel: చైతూ ఫ్యాన్స్ కంగారు పడక్కర్లేదు
అజిత్(Ajith) ఫ్యాన్స్ తో ఓ రేంజ్ లో ఆడుకున్న విడాముయార్చి(Vidamuyarchi) టీమ్ మొత్తానికి ఫిబ్రవరి 6న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దానికి కారణం నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన తండేల్(Thandel) సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుండటమే. చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది.
చైతూ చేస్తున్న మొదటి పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇదే. కాబట్టి ఈ సినిమా సోలోగా రిలీజవడం చైతూకి ఎంతో ముఖ్యం. కానీ సడెన్ గా రేసులోకి అజిత్ వచ్చి చేరాడు. అయితే ఈ విషయంలో చైతూ(Chaithu) ఫ్యాన్స్ పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. దానికి కారణం విడాముయార్చి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాకు మాస్ ఆడియన్స్ కంటే క్లాస్ ఆడియన్సే ఎక్కువ కనెక్ట్ అవుతారు.
కానీ తండేల్ అలా కాదు. తండేల్ ఎమోషనల్ కం యాక్షన్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవి(Sai Pallavi) పాత్రలు, వారి కెమిస్ట్రీ, పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ అన్నింటికీ మించి దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం ఇలా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయే అంశాలు చాలానే ఉన్నాయి. పైగా తెలుగులో విడాముయార్చికి తెలుగులో పెద్దగా క్రేజ్ కూడా లేదు. ఈ నేపథ్యంలో తండేల్కు మంచి టాక్ వస్తే తమిళనాడు లో తప్ప మిగిలిన రాష్ట్రాలన్నింటిలోనూ సత్తా చాటొచ్చు. సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గిన తర్వాత నుంచి తండేల్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయనున్నట్టు తెలుస్తోంది.













