Thandel: బాక్సాఫీస్ వద్ద రెండో రోజు తండేల్ ర్యాంపేజ్
నాగచైతన్య(naga chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) హీరోహీరోయిన్లుగా వచ్చిన తండేల్(Thandel) సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుంది. ఈ సినిమా డే2 కూడా మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇంకా చెప్పాలంటే మొదటి రోజు కంటే రెండో రోజు ఈ సినిమాకు ఆక్యుపెన్సీలు పెరిగాయని చెప్పొచ్చు. సినిమాలోని కంటెంట్, పాజిటివ్ రివ్యూలతో పాటూ మౌత్ టాక్ ను వాడుకుని తండేల్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది.
తండేల్కు రెండో రోజున భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడైపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే తండేల్ కు రెండో రోజు 260K పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. మొదటి రోజు రూ.21 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, రెండో రోజు కూడా రూ.20 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే మాటలు కాదు. మొత్తమ్మీద రెండు రోజుల్లోనే తండేల్ రూ. 41.20 కోట్లు కలెక్ట్ చేసి భారీ హిట్ గా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ సరిహద్దులను దాటి ఓవర్సీస్ లో కూడా తండేల్ తన సత్తా చాటుతుంది. ఇప్పటికే యూఎస్ఎలో ఈ సినిమా $550K మార్క్‌ను దాటేసింది. చూస్తుంటే మొదటి వారంలోనే తండేల్ మిలియన్ డాలర్ మార్క్ ను అందుకునేట్లు అనిపిస్తుంది. చూస్తుంటే ఈ లెక్క ఇప్పట్లో ఆగేలా లేదు. చైతన్య కెరీర్ లోనే తండేల్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమనిపిస్తుంది.













