బంగారం లాంటి ఛాన్స్ ను వదులుకున్న కంగువ
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్లోనే అత్యధిక అంచనాలతో వస్తోన్న సినిమా కంగువ. ఇప్పటికే కంగువ నుంచి రిలీజైన కంటెంట్ ప్రేక్షకుల్లో అంచనాలను బాగా రేకెత్తిస్తోంది. డైరెక్టర్ శివ ఇప్పటివరకు రొటీన్ మాస్ సినిమా తీశాడు కానీ ఇది నెక్ట్స్ లెవెల్ అనిపించేలా ఉంది. ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
కానీ ఇప్పుడు కంగువ అక్టోబర్ 10 నుంచి వాయిదా పడుతున్నటలు సిగ్నల్స్ వచ్చాయి. మొన్నటివరకు ఇది జస్ట్ రూమరే అనుకున్నారు కానీ ఇప్పుడు స్వయంగా సూర్యనే ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. అక్టోబర్ 10కి షెడ్యూల్ అయిన కంగువని రజినీకాంత్ వేట్టయాన్ కోసం వాయిదా వేస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు.
దీంతో సూర్య ఫ్యాన్స్ చాలా నిరాశ చెందుతున్నారు. అయితే కంగువ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 10 అంటే దసరా సెలవులు. ఇలాంటి డేట్ మళ్లీ కావాలన్నా దొరకదు. పైగా పెద్దగా పోటీ లేకుండా. ఇలాంటి టైమ్ లో కంగువ రిలీజైతే కచ్ఛితంగా సినిమా కలెక్షన్స్ దుమ్ము లేపేవి. కానీ ఇప్పుడు రజినీ సినిమా కోసం వాయిదా వేస్తున్నారు. ఇది మిస్ అయితే దీపావళికి వస్తుందనుకుంటే అప్పటికి విడాముయర్చి, అమరన్ లైన్ లో ఉన్నాయి. తెలుగులో లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ కూడా రిలీజ్ కానున్నాయి. కాబట్టి థియేటర్ల సమస్య వస్తుంది. పోటీ ఉంటే కలెక్షన్స్ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది.













