లారెన్స్ సినిమాలో స్టార్ హీరో గెస్ట్ రోల్
కొరియోగ్రాఫర్ గా మంచి క్రేజ్ సంపాదించిన రాఘవ లారెన్స్ ఆ తర్వాత డైరెక్టర్ గా మారి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. హర్రర్ జానర్ సినిమాలతో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లారెన్స్ ప్రస్తుతం హీరోగా ఫుల్ బిజీ అయిపోయి, వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు లారెన్స్ కాంచన్ సిరీస్ లో నాలుగో సినిమాను చేస్తూ, మరోవైపు లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో బెంజ్ అనే సినిమా చేస్తున్నాడు.
బి కన్నన్ అనే కొత్త టాలెంట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో అయిన సూర్య వేరే హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించడానికి ఎలాంటి మొహమాటం చూపించడు. తన పాత్ర వల్ల సినిమాకు మేలు జరుగుతుందనుకుంటే కచ్ఛితంగా ఆ సినిమాలో నటిస్తాడు.
లోకేష్ విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్రలో క్లైమాక్స్ లో మెప్పించిన విషయం తెలిసిందే. విక్రమ్ సినిమాకు రోలెక్స్ పాత్ర ప్రాణం పోసింది. అప్పటినుంచి సూర్యకు, లోకేష్ కు మధ్య మంచి అనుబంధముంది. ఈ నేపథ్యంలో లోకేష్ రిక్వెస్ట్ చేయడంతో సూర్య, లారెన్స్ బెంజ్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













