అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చానన్న సూర్య
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన సూర్య(Suriya)కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. సూర్య తండ్రి శివ కుమార్(Siva Kumar) యాక్టర్ అయినప్పటికీ వారిది చిన్న రేంజే. అలాంటి చిన్న స్థాయి నుంచి వచ్చిన సూర్య మాత్రం ఇప్పుడు చాలా పెద్ద స్థాయికి వెళ్లాడు. అన్న బాటలో యాక్టింగ్ లోకి అడుగుపెట్టిన కార్తీ(Karthi) కూడా మంచి స్టార్ గా ఎదిగాడు.
అయితే సూర్య సినిమాల్లోకి రాకముందు తనది చాలా సాధారణ కుటుంబం. సూర్య వల్లే వారి కుటుంబం అన్నివిధాలా ఎదిగింది. అలాంటి సూర్య నటుడిగా మారాలని కానీ, హీరోగా ఎదిగిపోవాలని కానీ సినిమాల్లోకి రాలేదని, తన తల్లి తండ్రికి తెలియకుండా తీసుకున్న బ్యాంక్ లోన్ తీర్చాలనే లక్ష్యంతోనే సినిమాల్లోకి వచ్చినట్లు సూర్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
సూర్య చదువు పూర్తవగానే గార్మెంట్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడట. 15 రోజులకు 750 రూపాయలు జీతం తీసుకున్న సూర్యకు మూడేళ్ల తర్వాత రూ.8 వేలకు జీతం పెరిగింది. తర్వాత కూడా సొంతంగా కంపెనీ పెట్టాలనుకున్నాడట కానీ తండ్రి బాటలో ఇండస్ట్రీలోకి రావాలని మాత్రం అనుకోలేదట. తన తల్లి తీసుకున్న లోన్ ఎలా తీర్చాలా అనుకుంటున్నప్పుడు సినిమాలో ఛాన్స్ వచ్చిందని, ఆ లోన్ తీర్చడానికి ఇండస్ట్రీలోకి వచ్చిన సూర్య ఇవాళ ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నట్లు తెలిపాడు.













