మహేష్ లుక్ దేని కోసం?
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. మహేష్ నుంచి వచ్చిన లాస్ట్ సినిమా సర్కారు వారి పాట. ఆ సినిమాకు కలెక్షన్లు అయితే వచ్చాయి కానీ అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. దీంతో మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం సినిమాపైనే ఫ్యాన్స్ హోప్ పెట్టుకున్నారు.
గుంటూరు కారం సినిమా కూడా అనుకున్న టైమ్ కు రిలీజ్ కాకుండా షూటింగ్ సమయం నుంచి లేటవుతూనే వస్తుంది. ఈ సంవత్సరమే రిలీజ్ కావాల్సిన సినిమా వచ్చే ఏడాదికి వెళ్లింది. దీంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవకుండా ఉండేందుకు మహేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెగ అప్డేట్స్ ఇస్తున్నాడు.
రీసెంట్గా జిమ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన మహేష్ ఇప్పుడు తాజాగా ఓ డాషింగ్ లుక్ ని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ లో మహేష్ బ్లాక్ కలర్ కళ్లద్దాలు పెట్టుకుని లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు. ఈ పోస్ట్ లో మహేష్ కమింగ్ సూన్ అని మెన్షన్ చేశాడు. దీంతో ఈ లుక్ సినిమా కోసమా లేక ఏదైనా బిజినెస్ ఎండార్స్మెంట్ కోసమా అని ఆలోచిస్తున్నారు.













