‘బుజ్జీ ఇలారా’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో సందీప్ కిషన్
సునీల్, ధన్‌రాజ్, చాందిని తమిళరాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బుజ్జీ ఇలారా. సైకలాజికల్ థ్రిల్లర్ ఉపశీర్షిక. గరుడవేగ అంజి దర్శకుడు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలు. దర్శకుడు జి.నాగేశ్వ రెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చుతున్నారు. ధన్‌రాజ్ ఫస్ట్ లుక్ ను హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ సీఐ కేశవ్నాయుడు అనే పోలీస్ అధికారిగా ధన్‌రాజ్ కనిపిస్తారు. హాస్యనటుడిగా తన పంథాకు పూర్తి భిన్నంగా ఇందులో సీరియస్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. కేశవ్నాయుడి అన్వేషణ దేనికోసమన్నది ఆకట్టుకుంటుంది. సునీల్, ధన్‌రాజ్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతాయి అన్నారు. పోసాని కృష్ణమూరళి, శ్రీకాంత్ అయ్యంగర్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: సాయికార్తిక్.













